Lenovo Tab P12: లెనోవో నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే.

|

Jul 31, 2023 | 1:04 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం లెనోవో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేస్తోంది. లెనోవో ట్యాబ్‌ పీ12 పేరుతో ఈ ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. రూ. 30 వేల బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్స్‌తో దీనిని తీసుకొచ్చారు. హోల్‌ సెన్సార్‌, ఇ-కంపాస్‌ వంటి, యాక్సిలరోమీటర్‌, గ్రావిటీ సెన్సార్‌ వంటి ప్రత్యేక ఫీచర్లను ఇందులో అందించారు. పవర్‌ కీపై ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇంతకీ ఈ ట్యాబ్లెట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

1 / 5
చైనాకు చెందిన టెక్‌ దిగ్గజం లెనోవో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. లెనోవో ట్యాబ్‌ పీ12 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారచు.

2 / 5
ఈ ట్యాబ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 12.7 ఇంచెస్‌ ఎల్‌టీపీఎస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 2,944x1,840 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకత.

3 / 5
ఇక ఈ ట్యాబ్‌ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 36,168గా ఉంది. ఆగస్టులో ఈ ట్యాబ్లెట్‌ ఆన్‌లైన్‌లో సేల్‌ ప్రారంభం కానుంది.

4 / 5
ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్‌లో మీడియా టెక్‌ డైమెన్సిటీ 7050 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇది స్టార్మ్ గ్రే, ఓట్ కలర్ షేడ్స్‌లో అందుబాటులోకి రానున్నాయి.

5 / 5
ఇక లెనెవో ట్యాబ్‌ పీ12లో 10,200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే ఏకంగా 10 గంటల వీడియో ప్లేబ్యాక్‌ అందిస్తుంది. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ, USB టైప్-C 2.0, WiFi 6 సపోర్ట్ ఈ ట్యాబ్లెట్ సొంతం.