
దేశీయ స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. లావా బ్లేజ్ పేరుతో తీసుకొచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్.. కంపెనీ అధికారిక వెబ్ సైట్‌తో పాటు అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది.

ఇక స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ కెపాసిటీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 12,999గా ఉంది. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

లావా బ్లేజ్‌లో 6.51 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 720x1,600 రిజల్యూషన్ ఈ స్క్రీన్ ప్రత్యేకత. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 700 ఎస్‌ఓసీ ద్వారా పని చేస్తుంది.

స్మార్ట్ ఫోన్ మెమోరీని మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎమ్ఏహెచ్ వంటి పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు.