
ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వాహనాలకు ఫుల్‌గా డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచదేశాలు పర్యావరణ పరిరక్షణపై దృష్టిపెట్టడం, ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సీడీ ఇవ్వడంతో అమ్మకాలు కూడా బాగా పెరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే రకరకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోవలోకే జపాన్‌కు చెందిన ఓ సంస్థ వినూత్న స్కూటర్‌ను తయారు చేసింది.

పైన ఉన్న ఫోటోలో కనిపిస్తోంది ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే మీరు నమ్ముతారా.? కానీ ఇది నిజం. ఇదొక ఎలక్ట్రిక్ స్కూటర్. ‘ఇకోమా’ అనే స్టార్టప్ సంస్థకు చెందిన వాహన తయారీ సంస్థ ‘టాటామెల్’తో కలసి దీనిని రూపొందించారు.

ఒక వ్యక్తి సునాయాసంగా ఈ బైక్‌పై ప్రయాణించవచ్చు. దీనిపై గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు.

అంతేకాకుండా మడతపెట్టుకునే అవకాశం ఉండడం ఈ బైక్ మరో ప్రత్యేకత. దీనిని ఎంచక్కా మడతపెట్టి ఆఫీసులో మన డెస్క్ పక్కన పెట్టుకోవచ్చు. దీని ధర ఎంత అన్న విషయాన్ని సంస్థ ప్రకటించలేదు.