ప్రముఖ టెక్ దిగ్గజం ఐటెల్ మార్కెట్లోకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐటెల్ ఏ05ఎస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. మొదట 4జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్‌లో తీసుకురాగా ఇప్పుడు 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మరో వేరియంట్‌ను లాంచ్ చేసింది.
Itel A05s ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. 720 x 1,612 పిక్సెల్, 60Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తే ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ Unisoc SC9863A ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఎస్‌కార్డు ద్వారా ఇంటర్నల్ మెమోరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరా విషయానికొస్తే ఐటెల్ ఏ05ఎస్ స్మార్ట్ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 4,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్‌కి వెనకాల అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందించారు.