
యాపిల్ సిరీస్ నుంచి కొత్త ఫోన్ లాంచింగ్‌కు సిద్ధమవుతోంది. ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారమం ఆధారంగా ఐఫోన్ 16లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16, 16 ప్లస్ లో రీ డిజైన్డ్ కెమెరా ఐలాండ్, ఐ ఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ లో 6.3 ఇంచులు, 6.9 ఇంచుల డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ప్రో మ్యాక్స్ సిరీస్‌లో గతంలో ఐఫోన్‌కి ఎన్నడూ లేనంత పెద్దగా ఈ ఫోన్ స్క్రీన్ ఉండనున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బెజెల్స్‌ను తగ్గించి స్క్రీట్ టు బాడీ రేషియోను అందించనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇక కెమెరాకు ఈ సిరీస్‌లో పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కొత్త మోడల్ లో 3డీ లేదా స్పాటియల్ వీడియో రికార్డింగ్ కేపబులిటీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌బీ సి పోర్ట్ ఇవ్వనున్నారు.

ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్‌లో టైటానియమ్ లాంటి మెటీరియల్‌ను ఇవ్వనున్నారని సమాచారం. ఇక ఐఫోన్ 16 ప్లస్ మోడల్స్ రేటు పాత ఫోన్స్‌లాగే ఉండొచ్చని, అయితే ప్రో సిరీస్ రేటు మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.