Instagram: ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి వాటికి చెక్‌.. అందుబాటులోకి కొత్త ఫీచర్‌

|

Apr 12, 2024 | 8:43 PM

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌కు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న ఈ సోషల్‌ మీడియా దిగ్గజం రోజురోజుకీ ఫాలోవర్లను పెంచుకుంటూ పోతోంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో కూడా రాజీ పడడంలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది..

1 / 5
ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన కంటెంట్‌కు కూడా కొదవలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీడియోలు, ఫొటోల రూపంలో పలువురు నగ్నత్వంతో కూడిన కంటెంట్‌ను కూడా పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇలాంటి కంటెంట్‌ టీనేజర్లకు చూపించకూడదనే ఉద్దేశంతో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

2 / 5
ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న వారికి నగ్నత్వానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, అసభ్యకరమైన, హానికరమైన కంటెంట్‌ను కనిపించకుండా చేయడానికి మెషీన్ లెర్నింగ్‌‌‌ను కంపెనీ ప్రస్తుతం పరీక్షిస్తోంది.

3 / 5
యూజర్లు ఎవరైనా అవతలి వ్యక్తికి నగ్నత్వంతో కూడిన ఫొటోలను పంపడానికి ప్రయత్నించినప్పుడు, ఒకసారి ఆలోచించండి అని యూజర్లకు ఒక వార్నింగ్‌ అలర్ట్ వస్తుంది. ఆన్‌ డివైస్‌ మెషిన్‌ లెర్నింగ్ ఇలాంటి కంటెంట్‌ను విశ్లేషిస్తుంది.

4 / 5
కాగా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన కంటెంట్‌ పెరుగుతోందని, యువత ఎక్కువ ఇలాంటి కంటెంట్‌కు అట్రాక్ట్ అవుతున్నారని యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి కంటెంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఇన్‌స్టా నడుము బిగించింది.

5 / 5
18 ఏళ్లు లోపు యూజర్లకు ఈ ఫీచర్‌ ఆటోమెటిక్‌గా ఆన్‌ అవుతుంది. దీంతో వారు అసభ్యకరమైన కంటెంట్‌ను చూడకుండా ఆపొచ్చు. అయితే 18 ఏళ్లు నిండిన వారు ఈ ఫీచర్‌ను మ్యాన్యువల్‌గా ఆన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.