
ఇప్పటి వరకు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న ఇన్ఫినిక్స్ తాజాగా మార్కెట్లోకి ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా పేరుతో లాంచ్ చేస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించనున్నట్లు ఇప్పటి వరకు లీకైన సమాచారం ఆధారంగా తెలుస్తోంది.

ఈ సమాచారం ఆధారంగా ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌లో డిస్‌ప్లేను అందించనున్నారు, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుందని సమాచారం. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత కెమెరాగా చెబుతున్నారు. ఏకంగా 200 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్ కెమెరాకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.

అలాగే ఇందులో 180 వాట్స్ థండర్ చార్జ్ టెక్నాలజీని ఇవ్వనున్నారని తెలుస్తోంది. 4700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

మీడియా టెక్ డైమన్సిటీ 920 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ ధర రూ. 25,000 నుంచి రూ. 30,000 మధ్య ఉండొచ్చని ఓ అంచనా. వీటిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.