కంపెనీ ఈ ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఫోన్ మొదటి వేరియంట్ 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. అయితే రెండవ వేరియంట్ 8GB RAM, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ ర్యామ్‌ను 16GB వరకు పెంచవచ్చు. అలాగే మైక్రో ఎస్‌డీ కార్డ్ సహాయంతో స్టోరేజీని1TB వరకు పెంచవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 8,999 నుండి ప్రారంభమవుతుంది. కంపెనీ దీనిని పామ్ బ్లూ, స్టార్‌ఫాల్ గ్రీన్, హారిజన్ గోల్డ్, స్టార్‌లిట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. ఫిబ్రవరి 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.