భారత్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా త్వరలోనే లావా బ్లేజ్ ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ నవంబర్ నెలలో భారత మార్కట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి నెట్టింట కొన్ని వార్తలు లీక్ అవుతున్నాయి.
నెట్టింట వైరల్ అవుతోన్న వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 15వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారని సమాచారం. అలాగే మెరుగైన క్వాలిటీ ఫొటోలు, వీడియోల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను అందించనున్నారు.
ఇక లావా గతేడాది విడుదల చేసిన 4జీ వెర్షన్ ధర రూ. 10,499గా ఉంది. ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన 2.5 కర్వ్‌ర్డ్ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు.90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ ప్రత్యేకత.