ఉద్యోగులు, విద్యార్థులు ఇద్దరికీ ఎంఐ ప్యాడ్ 6 పోర్టబుల్ ట్యాబ్ చాలా ఉపయోగపడుతుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 870 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. పని కోసం, వినోదం కోసం మీరు ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు. 2.8కే రిజల్యూషన్‌తో ఆకట్టుకునే డిస్‌ప్లే, లాగ్-ఫ్రీ గ్రాఫిక్‌లను సులభంగా ఉత్పత్తి చేయడానికి అధిక రిఫ్రెష్ రేట్, ఫోకస్ ఫ్రేమ్‌తో కూడిన 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీని ప్రత్యేకతలు. ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్సులు, ఆన్‌లైన్ తరగతులకు చాలా బాగుంటుంది. డాల్బీ అట్మోస్‌తో క్వాడ్ స్పీకర్ల తో ఆడియో చాలా స్పష్టంగా వెలువడుతుంది. సొగసైన డిజైన్, సన్నని బిల్డ్‌తో, మెటల్ యూనిబాడీ కారణంగా దీర్ఘకాలం పాటు ఉపయోగించవచ్చు. దీని అధిక కెపాసిటీ బ్యాటరీ రోజంతా పనిచేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ టాబ్లెట్ ధర రూ.25,999.