Best smart TVs: ఇంటిని సినిమా థియేటర్ చేసుకోవాలా..? ఈ టీవీలతో సాధ్యమే..!

Updated on: Apr 18, 2025 | 4:01 PM

ఆధునిక కాలంలో మంచి టీవీని ఎంపిక చేసుకోవడం చాలా క్లిష్టంగా మారింది. మార్కెట్ లో అందుబాటులో ఉన్న వాటిలో ఒక దాన్ని ఎంచుకోవడం చాలా కష్టమే. అయితే టీవీని కొనుగోలు చేయడానికి అనేక విషయాలను పరిశీలించాలి. ముందుగా మీ గదికి, హాలుకు సరిపడే సైజును గుర్తించాలి. అనంతరం టీవీ డిస్ ప్లే, నాణ్యత, ప్రాసెసర్, సౌండ్ తదితర విషయాలను గమనించాలి. ప్రస్తుతం 32, 50, 55, 65,75 అంగుళాల సైజులలో అనేక టీవీలు లభిస్తున్నాయి. వీటిలో 50 అంగుళాల టీవీ చాలా మంచి ఎంపికగా మారింది. చాలామంది వీటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ లో ప్రముఖ బ్రాండ్ల 50 అంగుళాల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు, ఇతర ప్రత్యేతకలను తెలుసుకుందాం.

1 / 5
హిస్సెన్స్ క్యూ ఎల్ఈడీ 50 అంగుళాల టీవీలో పిక్చర్ చాలా క్యాలిటీగా ఉంటుంది. హెచ్ డీఆర్10+ డీకోడింగ్ ద్వారా అత్యంత స్పష్టత లభిస్తుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ తో ఆడియో చాలా బాగుంటుంది. 178 డిగ్రీల వైడ్ వ్యూ యాంగిల్ కారణంగా గదిలోని ఏ మూల నుంచి అయినా వీక్షించవచ్చు. నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్, సోనీలివ్, హంగామా, జియో సినిమా, జీ5, ఈవోస్ నౌ తదితర యాప్ లను యాక్సెస్ ఉంది. స్పోర్ట్స్, యాక్షన్ సినిమాలు తదితర వేగవంతమైన కంటెంట్ చూస్తున్నప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది. అమెజాన్ లో రూ.33,999 ధరకు హిస్సెన్స్ టీవీ అందుబాటులో ఉంది.

2 / 5
ఇంటిలో మీ గదిని సినిమా హాలుగా మార్చుకోవాలనుకుంటే ఎల్ జీ 50 అంగుళాల టీవీ మంచి ఎంపిక. దీనిలో గేమ్ ఆప్టిమైజర్, ఫిల్మ్ మేకర్ మోడ్, ఏ5 ప్రాసెసర్ 4కే జెన్ 6, అపరిమిత ఓటీటీ యాప్ ల యాక్సెస్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 4కే అల్ట్రా హెచ్ డీ టెక్నాలజీతో సినిమాలు, ప్రోగ్రామ్ లను చాలా స్పష్టంగా వీక్షించొచ్చు. కనెక్టివిటీ కోసం వై-ఫై, 3 హెచ్ డీఎంఐ పోర్టులు, బ్లూ- రే ప్లేయర్లు, గేమింగ్ కన్సోల్, 2 యూఎస్ బీ పోర్టులు, ఈఏఆర్సీ, బ్ల్యూటూత్ 5.0 ఉన్నాయి. 2.0  చానల్ స్పీకర్ తో ఆడియో చాలా బాగా వినపడుతుంది. ఏఐ గేమింగ్ ఫీచర్ అదనపు ప్రత్యేకత. అమెజాన్ లో ఈ టీవీని రూ.39,999 ధరకు అందుబాటులో ఉంచారు.

3 / 5
ప్రజలు అత్యంత నమ్మకమైన బ్రాండ్లలో సామ్సంగ్ ఒకటి. దీని నుంచి విడుదలైన 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. క్రిస్టల్ ప్రాసెసర్ 4కే టెక్నాలజీతో కంటెంట్ ను చాలా స్పష్టంగా వీక్షించొచ్చు. పుర్ కలర్, హెచ్ డీఆర్ 10 ప్లస్ సపోర్టు, మోగా కాంట్రాస్ట్, మోషన్ ఎక్స్ లేటర్, కాంట్రాస్ట్ ఎన్ హన్సర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఉత్తమ గేమింగ్ అనుభవం కోసం ఆటోగేమ్ మోడ్ (ఏఎల్ఎల్ఎం), వీఆర్ఆర్, హెచ్జీఐజీ తదితర లక్షణాలు ఉన్నాయి. క్యూ సింపనీ స్పీకర్ల నుంచి సినిమా థియటర్ లో మాదిరిగా సౌండ్ అనుభూతి కలుగుతుంది. బ్ల్యూటూత్, యూఎస్ బీ, ఈథర్నెట్, హచ్ డీఎంఐ తదితర బహుళ కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. అమెజాన్ లో రూ.40,990కి ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.

4 / 5
స్పష్టమైన చిత్రం, నాణ్యమైన సౌండ్ కోరుకునే వారికి సోనీ బ్రావియా 2 సిరీస్ 50 అంగుళాల టీవీ బాగుంటుంది. దీనిలోని 4కే అల్ట్రా హెచ్ డీ టెక్నాలజీ, ఓపెన్ బాఫిల్ స్పీకర్లతో సినిమాలు, ఇతర ప్రోగ్రామ్ లను చాలా స్పష్టంగా చూడవచ్చు. టీవీలోని క్రోమోకాస్ట్ ద్వారా టాబ్లెట్, ల్యాప్ టాప్, ఫోన్ నుంచి స్మార్ట్ టీవీకి కంటెంట్ ను ప్రసారం చేసుకోవచ్చు. చిత్రాల స్పష్టత కోసం 4కే ప్రాసెసర్, అంతరాయం లేకుండా మోషన్ ప్లో ఎక్స్ ఆర్, హ్యాండ్స్ ఫ్రీ ఆపరేషన్ కోసం అలెక్సా ఫీచర్, కచ్చితత్వం కోసం హెచ్ డీఆర్10హెచ్ఎల్జీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. ఈ టీవీ రూ.52,990కి అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

5 / 5
అత్యుత్తమ టీవీల జాబితాలో తోషిబా 50 అంగుళాల ఎల్ఈడీ గూగుల్ టీవీ ఒకటి. శక్తివంతమైన 24 డబ్ల్యూ ఆడియో అవుట్ పుట్, డాల్బీ ఆట్మోస్, ఆడియో ఈక్వలైజర్, డాల్బీ డిజిటల్ డైలాగ్ క్లారిటీని పెంచుతాయి. ప్రతి సన్నివేశంలో డైలాగ్ లను అత్యంత స్పష్టంగా వినవచ్చు. సెట్ అప్ బాక్స్ ను కనెక్ట్ చేయడానికి 3 హెచ్ డీఎంఐ పోర్టులు, హార్డ్ డ్రైవ్ లు, ఇతర పరికరాలను కనెక్ట్ చేయడానికి 2 యూఎస్ బీ పోర్టులు, అంతర్నిర్మిత వై-ఫై, బ్ల్యూటూత్, ఈథర్నెట్ ఆర్ జే 45 తదితర ఎంపికలు ఉన్నాయి. డైనమిక్, స్టాండర్డ్, స్పోర్ట్స్, పీసీగేమ్, ఎనర్జీ సేవింగ్, సినిమా, ఫిల్మ్ మేకర్ మోడ్ తదితర పిక్చర్ మోడ్ లకు మద్దతు లభిస్తుంది. అమెజాన్ లో రూ.22,999కు తోషిబా టీవీని కొనుగోలు చేయవచ్చు.