
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం హువావే మార్కెట్లోకి కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. హువావే వాచ్ జీటీ5 పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. ఈ వాచ్ ఫీచర్ల విషయానికిస్తే దీనిని 41 ఎమ్‌ఎమ్, 46 ఎమ్‌ఎమ్ మోడల్ వాచ్‌లను తీసుకొచ్చారు.

46 ఎమ్‌ఎమ్ మోడల్‌లో 1.43 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే 41 ఎమ్‌ఎమ్ వాచ్‌లో 1.32 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. ఇందులో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, బేరోమీటర్, టెంపరేచర్ సెన్సార్ వంటి ఫీచర్లను అందించారు.

బ్యాటరీ విషయానికొస్తే ఈ వాచ్‌లో 56 ఎమ్‌ఎమ్ వేరియంట్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజులు పనిచేస్తుంది. అలాగే 41 ఎమ్‌ఎమ్ వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజులపాటు నాన్ స్టాప్‌గా పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్‌లు ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌కు సపోర్ట్ చేస్తుంది. హువాయే యాప్ గ్యాలరీ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. అక్టోబర్ 20వ తేదీ నుంచి ఈ వాచ్ అందుబాటులోకి రానుంది.

ధర విషయానికొస్తే 41mm వేరియంట్ ధర రూ. 15,999కాగా 46 ఎమ్ఎమ్ మోడల్ ధర రూ.16,999గా నిర్ణయించారు. ఈ వాచ్ను బ్లాక్, బ్లూ, వైట్ కలర్స్‌లో తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రీ ఆర్డర్ బుకింగ్స్ ప్రారంభమైన ఈ వాచ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది.