
వైఫై వినియోగం ఈ రోజుల్లో అనివార్యంగా మారింది. ఇక వైఫైని ఉపయోగించే సమయంలో ప్రతీ ఒక్కరం పాస్‌వర్డ్ సెట్ చేసుకుంటాం. తెలియని వ్యక్తులు మన ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయకూడదనే ఉద్దేశంతో స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకుంటాం.

అయితే కొన్ని సందర్భాల్లో తెలిసిన వ్యక్తులు లేదా స్నేహితులు మన వైఫై పాస్‌వర్డ్‌ను అడుగుతుంటారు. అయితే చాలా సందర్భాల్లో పాస్‌వర్డ్‌ను మరిచిపోతుంటాం. మరి ఇలాంటి సమయాల్లో పాస్‌వర్డ్‌ను ఎలా తెలుసుకోవాలి.? ఇందుకోసం ఒక చిన్న టెక్నిక్ ఉంది. అదేంలో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా పాస్‌వర్డ్‌లు స్ట్రాంగ్‌గా సెట్ చేసుకునే క్రమంలో వాటిని మర్చిపోతుంటాం. అయితే మర్చిపోయిన పాస్‌వర్డ్‌ను తిరిగి పొందాలంటే.. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్లు అయితే ముందుగా సెట్టింగ్స్ వెళ్లి అందులో వైఫ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

అనంతరం నెట్‌వర్క్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత పాస్‌వర్డ్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. వెంటనే మీరు ఏ పస్‌వర్డ్ సెట్ చేసుకున్నారో కనిపిస్తుంది. దీంతో దానిని ఇతరులకు షేర్ చేస్తే సరిపోతుంది.

ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగిస్తుంటే.. ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం నెట్‌వర్క్ పక్కన ఉండే రౌండ్ సింబల్‌ను టచ్ చేయాలి. ఆ తర్వాత షేర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీకు ఒక క్యూఆర్ కోడ్‌తో పాటు కింద పాస్‌వర్డ్ సైతం ప్రత్యక్షమవుతుంది.