
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ తయారీ సంస్థ హానర్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హానర్ 200 లైట్ పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ ఫోన్ సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానుంది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌తో పాటు హానర్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను సియాన్ లేక్, మిడ్ నైట్ బ్లాక్, స్టారీ బ్లూ కలర్ ఆప్షన్లలో తీసుకొస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా హానర్ 200 లైట్ 5జీ, హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్‌లను తీసుకొచ్చారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్ ట్రిపుల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8 వెర్షన్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.

ఇక ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఇక ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 35 వాట్స్ సూపర్ చేంజ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.

సెక్యూరిటీ కోసం ఇందులో సడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు. అలాగే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 680 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.