
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హానర్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హానర్ మ్యాజిక్ 6 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను ఆగస్టు 2వ తేదీన భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు.

హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.8 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఓ ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 1280×2880 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌తో పాటు, హానర్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ఆగస్టు 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అందుబాటులోకి రానుంది.ఈ ఫోన్‌ను బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో తీసుకొస్తున్నారు. 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చే ఈ స్క్రీన్‌ను సన్‌లైట్‌లోనూ స్పష్టం చూడొచచు.

హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌తో పాటు 256జీబీ, 512 బీబీ, 1 బీబీ స్టోరేజ్ వేరియంట్స్‌తో తీసుకొస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 180 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను, అలాగే రెండు 50 ఎంపీతో కూడిన రెండు కెమెరాలను అందించనున్నారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో 80 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.