HMD barbie: ఈ స్మార్ట్‌ఫోన్‌ మహిళలకు ప్రత్యేకం.. హెచ్‌ఎమ్‌డీ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది

|

Aug 01, 2024 | 2:01 PM

మహిళల కోసమే అందుబాటులో ఉండే ఎన్నో గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయని తెలిసిందే. అయితే మహిళల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్స్‌ తక్కువేనని చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హెచ్‌ఎమ్‌డీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హెచ్‌ఎమ్‌డీ వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. నోకియా ఫోన్‌లను తయారు చేసే ఈ కంపెనీ ప్రస్తుతం సొంత బ్రాండింగ్‌తో ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది ఇప్పటికే హెచ్‌ఎమ్‌డీ క్రెస్ట్‌, క్రెస్ట్‌ మ్యాక్స్‌ 5జీ పేర్లతో కొత్త ఫోన్‌లను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది.

2 / 5
హెచ్‌ఎమ్‌డీ మహిళల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. హెచ్‌ఎమ్‌డీ బార్బీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఆగస్టు 28వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు.

3 / 5
అయితే ఈ ఫోన్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకనట చేయలేదు. అయితే నెట్టింట మాత్రం ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫొటలతో పాటు ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి. వాటి ప్రకారం ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

4 / 5
మహిళలను అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను అందుకు అనుగుణంగానే పింక్‌ కలర్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌ మోడల్‌లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ S30+ లేదా KaiOS ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేయనుందని టాక్‌.

5 / 5
ఇక ఈ ఫోన్‌ను బొమ్మల తయారీ సంస్థ మెటల్‌ సహకారంతో బార్బీ థీమ్‌తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో ఈ ఫోన్‌ను ఎప్పుడు లాంచ్‌ చేస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఈ ఫోన్‌లో టచ్‌ స్క్రీన్‌తో పాటు, డయల్‌ ప్యాడ్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.