ఇన్ఫినిక్స్ జీరో 30.. ఈ ఫోన్లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ 3డీ కర్వ్ డ్ 10 బిట్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 108ఎంపీ ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 50ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. దీనిలో డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ మెమరీతో ఈ ఫోన్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది.
ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో.. ఈ స్మార్ట్ ఫోన్ సైబర్ మెకా డిజైన్, ఎల్ఈడీ బ్యాక్ లైట్ ఇంటర్ ఫేస్ తో వస్తుంది. అలాగే 6.67 అంగుళాల 10 బిట్ ఫుల్ హెచ్ డీ ప్లస్ ఐ కేర్ అమోల్డ్ డిస్ ప్లే 900 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుందన్నారు. మీడియా టెక్ డైమెన్సిటీ 8050 చిప్ సెట్ అన్టుటు 700కే ఎన్ హ్యాన్స్ డ్ గేమింగ్ పనితీరుని అందిస్తుంది. దీనిలో 16జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 108ఎంపీ అల్ట్రా కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు టైప్ సీ 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.
ఐకూ జెడ్ 7 ప్రో.. దీనిలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 300హెర్జ్ శ్యాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. వెనుకవైపు 64ఎంపీ ఆరా లైట్ ఓఐఎస్ కెమెరా ఉంటుంది. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4600ఎంఏహెచ్ బ్యాటరీ 66వాట్ల ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీ ఉంటుంది.
మోటో ఎడ్జ్ 40 నియో.. ఈ ఫోన్లో 6.55 అంగుళాల పీ ఓఎల్ఈడీ 10 బిట్ డిస్ ప్లే 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 68వాట్ల చార్జింగ్ సపోర్టు ఉంటుంది. 50ఎంపీ ఓఐఎస్ కెమెరా, 13ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
పోకో ఎక్స్5 ప్రో.. ఈ ఫోన్లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 778జీ చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్. దీనిలో వెనుకవైపు 108ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.