Best Camera Phones: ప్రతి క్లిక్ ఇస్తుంది కిక్.. బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్లు ఇవే.. అనువైన ధరలోనే..

|

Mar 08, 2024 | 8:21 AM

ఇటీవల కాలంలో ఫొటోగ్రఫీకి డిమాండ్‌ పెరుగుతోంది. అందరూ షార్ట్స్‌, రీల్స్‌ అంటూ తీస్తున్నారు. ఈ క్రమంలో బెస్ట్‌ క్వాలిటీ కెమెరాలు కలిగిన స్మార్ట్‌ ఫోన్లు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అందరూ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లను ఏర్పాటు చేసుకోలేరు. అందుకే ఉత్తమ కెమెరాలున్న ఫోన్లను ఇష్టపడుతున్నారు. మీరు కూడా మంచి కెమెరా క్లారిటీ కలిగిన స్మార్ట్‌ ఫోన్లు కావాలనుకుంటే ఈ కథనం మిస్‌ అవ్వకండి. దీనిలో బెస్ట్‌ కెమెరా స్మార్ట్‌ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం.

1 / 5
ఐకూ జెడ్‌7ఎస్‌.. ఇది ఐఓఎస్‌తో కూడిన 64-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. బలమైన సెకండరీ సెన్సార్ లేదు. ప్రకాశవంతమైన 6.38-అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేతో పాటు తగినంత షూటింగ్, ఎడిటింగ్ ఎంపికలను అందిస్తుంది, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పాటు 44వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 4,500ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఇది కాంపాక్ట్ కెమెరా ఔత్సాహికులకు బెస్ట్‌ చాయిస్‌.

2 / 5
మోటోరోలా జీ84.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ వెనుకవైపు 50-మెగాపిక్సెల్ సెన్సార్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. వివా మెజెంటాలో సొగసైన వేగన్ లెదర్ డిజైన్‌తో ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్‌ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది.

3 / 5
వన్‌ప్లస్‌ నోర్డ్‌ సీఈ3 లైట్‌.. ఇది 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ తో వస్తుంది. 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో సహా ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 పైన ఆక్సిజన్‌ ఓఎస్‌తో, ఇది క్లీన్ యూజర్ అనుభవాన్ని అందిస్తుంది. దీని ధర రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది.

4 / 5
రియల్ మీ 11 5జీ.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో బలమైన ఫోటోగ్రఫీ పనితీరును అందిస్తుంది. 6.67-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే, మీడియా టెక్‌ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టుతో కూడిన 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని ధర రూ. 16,999 నుంచి ప్రారంభమవుతుంది.

5 / 5
రెడ్‌మీ నోట్‌ 13 5జీ.. ఈ ఫోన్‌ 108 మెగాపిక్సల్‌ ప్రధాన కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో వస్తుంది. 6.67-అంగుళాల ఫుల్‌హెచ్డీ ప్లస్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కూడిన 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ. 17,999 నుంచి ప్రారంభమవుతుంది.