రియల్‌మీ జీటీ నియో 3టీ.. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 870జీ ప్రాసెసర్ ఉంటుంది. 6.62 అంగుళాల అమోల్డ్ ఈ4 డిస్ ప్లే ఫుల్ హెచ్ ప్లస్ రిజల్యూషన్ తో వస్తుంది. 1300 నిట్స్ ఆప్టిమమ్ బ్రైట్ నెస్, 5 మిలియన్:1 కాంట్రాస్ట్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 16ఎపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఇది 12 నిమిషాల్లో 50శాతం చార్జింగ్ ఎక్కుతుంది. ఈ ఫోన్ డాష్ ఎల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ. 22,999గా ఉంది.