ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్.. క్రోమ్ యూజర్ల కోసం కొత్త సేఫ్టీ ఫీచర్‌ను తీసుకొస్తోంది. సైబర్ దాడులు పెరుగుతోన్న నేపథ్యంలో యూజర్లకు భద్రత కల్పించేందుకు క్రోమ్‌లో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.
యూజర్ల సెర్చింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు, డేటాకు సెక్యురిటీ కల్పించే ఉద్దేశంతో గూగుల్.. 'ఆటోమేటిక్ సేఫ్టీ ఫీచర్'ను తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ క్రోమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ యూజర్ల పాస్‌వర్డ్‌లు, సైట్‌ల భద్రత చెకింగ్‌లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.
ఒకవేళ మీరు వీక్ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నట్లైతే.. వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండని హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే మీరు బ్రౌజ్ చేస్తున్న సైట్ సురక్షితమైందా, కాదా అనే విషయాన్ని సైతం యూజర్లకు తెలియచేస్తుంది.
ఇక అవసరం లేకపోయినా నోటిఫికేషన్స్ ఇచ్చే వెబ్‌సైట్స్‌ను సైతం ఈ కొత్త ఫీచర్ కంట్రోల్ చేస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్స్‌ను బ్లాక్ చేసి యూజర్లకు డిస్బ్రబెన్స్ లేకుండా చేయడంలో ఈ కత్త ఫీచర్ ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ కొత్త ఫీచర్‌ను త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా క్రోమ్ డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్ సహాయంతో రెగ్యులర్‌గా చూసే సైట్లను కొంతకాలం చూడకపోతే వాటికి సంబంధంగా చూపించే లోకేషన్, మైక్రోఫోన్ వంటి వాటిని ఆటోమెటిక్‌గా ఆఫ్ చేస్తుంది.