స్మార్ట్ ఫోన్‌లో బ్యాటరీకి ఉన్న ప్రాధాన్యత ఉన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని రకాల ఫీచర్లు ఉన్నా బ్యాటరీ సరిగా పనిచేయకపోతే అవన్నీ వృథానేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అయితే స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారు ఎదుర్కొనే సమస్యల్లో బ్యాటరీ వేడెక్కడం ఒకటి. కొన్ని కారణాల వల్ల బ్యాటరీ మాములు స్థాయి కంటే ఎక్కువ వేడెక్కుతుంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..
స్మార్ట్‌ఫోన్‌ను చార్జింగ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో నకిలీ చార్జర్లను ఉపయోగించకూడదు. మొబైల్ కొనుగోలు చేసే సమయంలో వచ్చే చార్జర్‌నే ఉపయోగించాలి. ఒకవేళ చార్జర్ పాడైపోతే.. సదరు మొబైల్ కంపెనీకి చెందిన ఒరిజినల్ చార్జర్‌నే కొనుగోలు చేయాలి. అలాగే మార్కెట్లో దొరికే నకిలీ బ్యాటరీలను కూడా వాడకూడదు.
కొందరు రాత్రంతా చార్జింగ్ పెడుతారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ పనితీరు దెబ్బతిని వేడెక్కడానికి కారణంగా మారుతుంది. అలాగే బ్యాటరీ కచ్చితంగా వందశాతం చార్జ్ అవ్వాలని ఏం లేదని నిపుణులు చెబుతున్నారు. 90 శాతం చార్జింగ్ కాగానే తొలగించాలి.
ఇక చార్జింగ్ చేసే సమయంలో కొందరు టీవీ, ఫ్రిడ్జ్‌లపై పెడుతుంటారు. దీనివల్ల కూడా ఫోన్ బ్యాటరీ వేడెక్కే ప్రమాదం ఉంటుంది. సదరు ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి వచ్చే వేడి మొబైల్‌పై ప్రభావం చూపుతుందని గుర్తించాలి.
మొబైల్ ఫోన్‌లను సీపీయూ, ల్యాప్‌టాప్ ద్వారా కేబుల్ సహాయంతో చార్జింగ్ చేస్తుంటారు. ఇలా చేసినా బ్యాటరీ పనితీరు దెబ్బతింటుంది. ఇది కూడా బ్యాటరీ వేడెక్కడానికి కారణంగా మారుతుందని చెబుతున్నారు. కాబట్టి వీటిని ఉపయోగించకపోవడమే మంచిది.