ట్విట్టర్ వేదికా ఇటీవల చాలా రకాల వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. మరి అలాంటి వీడియోలను డౌన్‌లోడ్ చేసిన వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆ వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియదు.
అయితే కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా ట్విట్టర్‌లో వచ్చే వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మీకు తెలుసా.? ఇంతకీ ఆ స్టెప్స్ ఏంటంటే..
ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ‘డౌన్‌లోడ్ ట్విట్టర్ వీడియోస్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ట్విట్టర్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత ట్విట్టర్‌లో మీకు నచ్చిన వీడియోను ఓపెన్ చేయాలి, అనంతరం అక్కడ కనిపించే షేర్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని. కాపీ ది లింక్ టు ట్వీట్‌పై క్లిక్ చేయాలి.
చివరిగా ‘డౌన్‌లోడ్ ట్విట్టర్ వీడియోస్ యాప్‌ని ఓపెన్ చేసి లింక్ పేస్ట్ చేసి. డౌన్‌లోడ్‌పై క్లిక్ చేస్తే చాలు వెంటనే ఫోన్‌లో వీడియో డౌన్‌లోడ్ అవుతుంది.