
సామ్‌సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ 3 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 95,999గా ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పైస ఏకంగా 59 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 38,499కే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 33,000 డిస్కౌంట్ పొందొచ్చు.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొచ్చారు. అలాగే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 880 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇందులో 3300 ఎమ్‌ఏహెచ్ లిథియం ఆయాన్ బ్యాటరీని అందించారు.

కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 5జీ, 4జీ, ఎల్‌టీఈ, జీఎస్‌ఎమ్, జీపీఆర్‌ఎస్ వంటి ఫీచర్లను అందించారు. నానో సిమ్, ఈ సిమ్‌లు ఈ ఫోన్‌లో సెట్ అవుతాయి. ఇక ఈ ఫోన్‌పై ఏడాది మ్యానిఫ్యాక్చరింగ్ వారంటీని అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ డైమెన్షన్ విషయానికొస్తే ఈ ఫోన్ 72.2 ఎమ్‌ఎమ్ విడ్త్‌తో అందించారు. అలాగే 183 గ్రాముల బరువుతో డిజైన్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను వాటర్ రెసిస్టెంట్‌తో తీసుకొచ్చారు. ప్రస్తంలో తొలి ఫోల్డబుల్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ ఇదేనని కంపెనీ చెబతోంది.