
ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్14 ప్లస్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్‌పై సుమారు రూ. 20 వేలకిపైగా డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇంతకీ ఫోన్ ఎంతకు లభిస్తోంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం

ఐఫోన్ 14 ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 79,000 కాగా 29 శాతం డిస్కౌంట్‌తో రూ.55,999కే లభిస్తోంది. అలాగే ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభించనుంది. అలాగే యూపీఐ ట్రాన్సాన్షన్ చేసేత అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ఇక ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెండు రెయిర్ కెమెరాలను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఈ ఫోన్‌లో ఏ15 బయోనిక్ చిప్, 6 కోర్ ప్రాసెసర్‌ను అందించారు. సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. స్టీరియో స్పీకర్‌లను ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు. ఐఓస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ పోన్ పనిచేస్తుంది.

కనెక్టివిటీ విషయానికొస్తే ఈ ఫోన్లో 5జీ, 4జీ వోల్ట్, 4జీ లైట్, యూఎమ్‌టీఎస్, జీఎస్‌ఎమ్ వంటి ఫీచర్లను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4323 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందన్న దానిపై క్లారిటీ లేదు.