ఫైర్-బోల్ట్ తాజాగా విజనరీ పేరుతో కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. గురువారం మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్ వాచ్ తొలి సేల్ జులై 22 నుంచి ప్రారంభమైంది.
ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 368×448 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 1.78-అంగుళాల AMOLED స్క్వేర్ డిస్‌ప్లేను అందించారు. ఈ వాచ్ 100 స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది.
SpO2 మానిటర్, హార్ట్ రేట్ ట్రాకర్, స్టెప్స్ ట్రాకర్, స్లీప్ మానిటర్ వంటి ఫీచర్లు ఈ వాచ్ సొంతం. AI వాయిస్ అసిస్టెన్స్, స్మార్ట్ నోటిఫికేషన్‌లు, పెడోమీటర్, డైలీ వర్కౌట్ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
బ్లూటూత్ కాలింగ్ ద్వారా వాచ్‌తోనే నేరుగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే కాల్ హిస్టరీ, సింక్, సేవ్ కాంటాక్ట్స్ ఆప్షన్‌ను ప్రత్యేకంగా అందించారు.
బ్యాటరీ విషయానికొస్తే ఒక్కసారి చార్జ్ చేస్తే 5 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. 57 గ్రాముల బరువు ఉండే ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 3,799గా ఉంది.