పంక్‌ఫంక్ 4జీ సిమ్ కార్డ్ స్మార్ట్‌వాచ్ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. అధిక బ్రైట్‌నెస్‌తో అంతర్నిర్మిత టార్చ్, ఎంపీ3 ఐల్స్‌కు మద్దతు ఇచ్చే ఎంపీ 3 ప్లేయర్, కాలిక్యులేటర్, అనుకూలీకరించదగిన థీమ్‌లు, స్క్రీన్‌సేవర్‌లతో వస్తుంది. ఇంకా ఇది సెల్ఫీ-కెమెరాను కలిగి ఉంది. సౌండ్ రికార్డింగ్‌ను కూడా హోస్ట్ చేస్తుంది. ఈ వాచ్‌లోని కెమెరా ద్వారా వీడియోలు, ఫోటోలు రెండింటినీ రికార్డ్ చేయవచ్చు, ఇది గరిష్టంగా 6 గంటల వీడియో రికార్డింగ్‌ను అనుమతిస్తుంది. బ్యాటరీ పూర్తిగా రీఛార్జ్ చేస్తే 3-7 రోజులు లైఫ్ ఇస్తుంది. ఈ వాచ్ 2 గంటల్లో చార్జ్ అవుతుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.1,299.