
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల వినియోగం, తయారీ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రపంచదేశాలు విద్యుత్ ఆధారిత వాహనాల తయారీకి ఊతమివ్వడంతో ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.

ఇక ఈ క్రమంలోనే చిన్న కార్ల తయారీ ఊపందుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో వినూత్న కారు మార్కెట్లోకి రావడడానికి సిద్ధమవుతుంది.

డెన్నార్మ్‌కు చెందిన ఓ ఆటోమొబైల్ సంస్థ ‘సిటీ ట్రాన్స్‌ఫార్మర్’ పేరిట ఓ వినూత్న కారును రూపొందించింది. త్వరలోనే ఈ కారు యూరోప్ అంతటా మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.

అత్యంత చిన్నగా ఉండే ఈ కారులో ఇద్దురు ఎంచక్కా ప్రయాణించవచ్చు. ఈ కారు గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.

శక్తివంతమైన బ్యాటరీని అందించిన ఈ కారును అరగంట సేపు చార్జ్ చేసుకుంటే, ఏకధాటిగా 180 కిలోమీటర్లు ప్రయాణింవచ్చు.

ఇక ఈ కారును పార్క్ చేసేటప్పుడు దీని ఛెసిస్‌ను మడత పెట్టుకోవచ్చు. దీనివల్ల వంద సెంటీమీటర్ల చోటులోనే కారును పార్క్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.