
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంస్థ నుంచి వచ్చిన రెడ్‌మీ స్మార్ట్ ఫోన్‌లు బాగా పాపులర్.

అయితే రెడ్‌మీ కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా స్మార్ట్ టీవీలను కూడా తయారు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 'ఎమ్‌ఐ' పేరుతో భారత మార్కెట్లో ఈ టీవీలు సందడి చేస్తున్నాయి.

అయితే తాజాగా రెడ్‌మీ మరో మూడు స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'X' సిరీస్‌లో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ టీవీలు మార్చి 26 నుంచి ఆన్‌లైన్‌తో పాటు ఎంఐ స్టూడియో ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

4K HDR, HDR 10+, డాల్బీ విజన్, 30W డాల్బీ ఆడియో స్పీకర్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్యూటూత్ 5.0, వివిడ్ పిక్చర్ ఇంజిన్ సపోర్ట్ ఈ టీవీల ప్రత్యేకతలు.

మూడు వేరియంట్ల ధరల విషయానికొస్తే.. రెడ్‌మీ స్మార్ట్ టీవీ X65 ధర రూ.57,999

ఈ సిరీస్‌లో తీసుకొస్తోన్న రెండో టీవీ రెడ్‌మీ స్మార్ట్ టీవీ X55 ధర రూ.38,999

ఇక మూడో టీవీ రెడ్‌మీ స్మార్ట్ టీవీ X50 ధర రూ.32,999గా నిర్ణయించారు.