
రెడ్‌మీ 12 సీ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ అసలు ధర రూ. 13,999కాగా అమెజాన్‌లో 39 శాతం డిస్కౌంట్‌తో రూ. 8499కే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ ఇక్కడితో ముగియలేదు ఎక్ఛ్సేంజ్ ఆఫర్ కింద పాత ఫోన్‌ను ఇచ్చి ఏకంగా రూ. 8533 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇఉందలో 6.71 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

కెమెరా విషాయనికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 10 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. డ్యూయల్ బాండ్ వైఫై సపోర్ట్ కనెక్టివిటీ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ బరువు 192 గ్రాములు ఉంటుంది. అలాగే కంపెనీ నుంచి ఏడాది మానిఫ్యాక్షర్ వారంటీ, ఇన్ బాక్స్ యాక్ససరీస్‌లకు ఆరు నెలల వారంటీ ఇస్తుంది. ఇందులో 1 లిథియం పాలిమర్ బ్యాటరీని అందించారు.