
ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ యూజర్లను ఆకట్టుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే తాజాగా నాలుగు కొత్త రీచార్జ్ ప్లాన్స్‌తో యూజర్ల ముందుకు వచ్చింది. ఇంతకీ ఆ ప్లాన్స్ ఎంటంటే..

రూ. 184 ప్లాన్: ఈ రీచార్జ్ చేసుకుంటే యూజర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 1 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.

రూ. 185 ప్లాన్: 28 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్‌టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజూ ఒక జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్ పొందొచ్చు. పీఆర్‌బీటీ ఉచిత యాక్సెస్, అరెనా మొబైల్ గేమింగ్ సర్వీస్ యాక్సెస్ ఈ ప్లాన్ ప్రత్యేకత.

రూ. 186 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే యూజర్లు 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 1 జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల పాటు రోజూ 100 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. వీటితో పాటు 28 రోజులకు పీఆర్‌బీటీ ఉచిత యాక్సెస్, హార్డీ గేమ్స్ సర్వీస్‌కు ఉచిత యాక్సెస్ పొందొచ్చు.

రూ. 347 ప్లాన్: ఈ ప్లాన్‌తో 56 రోజుల వ్యాలిడిటీతో కూడిన అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్, 2 జీబీ హైస్పీడ్ డేటా యాక్సెస్ పొందొచ్చు. హైస్పీడ్ డేటా లిమిట్ ఒకసారి పూర్తయితే ఇంట్‌నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది.