
యాపిల్ అల్ట్రా వాచ్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 60 వేలు పెట్టాల్సిందే. అయితే అచ్చంగా అలాంటి లుక్‌తో ఉన్న వాచ్ కేవలం రూ. 1500కే లభిస్తే భలే ఉంటుంది కదూ! అచ్చంగా ఇలాంటి ప్లాన్ చేసింది బౌల్ట్ కంపెనీ.

బౌల్ట్ క్రౌన్ పేరుతో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 1499గా ఉంది. అచ్చంగా యాపిల్ అల్ట్రా వాచ్ స్టైల్‌లో డిజైన్ చేసిన ఈ స్మార్ట్ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత.? లాంటి వివరాలు మీకోసం..

ఫీచర్ల విషయానికొస్తే.. 1.95 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ వాచ్ స్క్రీన్ గరిష్టంగా 900 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ వాచ్‌లో బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ అందించారు. బ్లూటూత్ కాలింగ్ చేసుకోవచ్చు.

ఇక హెల్త్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఎస్‌పీఓ2 సెన్సార్, హార్ట్ రేట్ ట్రాకర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, ఫిమేల్ హెల్త్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించారు.

100కిపైగా స్పోర్ట్స్ మోడల్స్ ఈ వాచ్ ప్రత్యేకత. 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లుఉన్నాయి. ఏఐ వాయిస్ అసిస్టెన్స్ ఈ వాచ్ మరో ప్రత్యేకత. డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ676 ప్రొటెక్షన్ అందించారు.