
ఆడియో ఉత్పత్తులకు భారత్‌లో పెట్టింది పేరైన బోట్స్ సంస్థ ఇటీవల వరుసగా కొత్త ప్రొడెక్ట్స్‌ను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తక్కువ ధరలో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది.

బోట్ ఎయిర్‌డోప్స్ 111 పేరుతో భారత్‌లో లాంచ్ చేసిన ఈ ఇయర్‌బడ్స్‌లోని ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. సౌండ్ నాణ్యతకు ప్రాయరిటీ ఇచ్చిన బోట్ 13 ఎమ్‌ఎమ్ సౌండ్ డ్రైవర్లను అందించింది.

ఇందులోని బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో చాలా సులభంగా గ్యాడ్జెట్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. చార్జింగ్ కేస్ టైప్‌సీ చార్జింగ్‌కు సపోర్ట్ చేసింది.

ఇక ఛార్జింగ్ విషయానికొస్తే ఒక్కసారిగా ఫుల్ చార్జ్ చేస్తే 7 గంటలపాటు నాన్ స్టాప్‌గా పనిచేస్తాయి. ఇక చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 28 గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.

గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ వంటి వాటికి సపోర్ట్ చేసే ఈ ఇయర్ బడ్స్ రూ. 1499కి అందుబాటులో ఉన్నాయి. బోట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అన్ని ప్రముఖ ఈ కామర్స్ సైట్స్‌లో ఇయర్‌బడ్స్ అందుబాటులో ఉన్నాయి.