
మిచెలిన్ (Michelin) టైర్లు వాటి అధిక నాణ్యత, స్థిరత్వం, అద్భుతమైన పట్టుకు ప్రసిద్ధి చెందాయి. పైలట్ స్పోర్ట్ 4 ప్రత్యేకంగా వేగం, ఖచ్చితమైన నిర్వహణ కోసం తయారు చేశారు. ఇది తడి, పొడి రోడ్లపై అద్భుతమైన బ్రేకింగ్, నిర్వహణను అందిస్తుంది.

బ్రిడ్జ్‌స్టోన్ (Bridgestone) తురంజా T005 టైర్లు భద్రత, సౌకర్యం, పనితీరు అద్భుతమైంగా ఉంటాయి.ఈ టైర్లు ప్రత్యేకంగా పట్టణ, హైవే డ్రైవింగ్ కోసం రూపొందించింది కంపెనీ.

భారత మార్కెట్లో అపోలో అల్నాక్ 4G (Apollo Alnac 4G) టైర్లు ఒక గొప్ప ఎంపిక. ఈ టైర్లు ముఖ్యంగా తడి రోడ్లపై మంచి గ్రిప్‌ను అందిస్తాయి. అలాగే సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

గుడ్‌ఇయర్ అస్యూరెన్స్ ట్రిపుల్‌మ్యాక్స్ 2 (Goodyear Assurance Triplemax 2) టైర్లు ప్రత్యేకమైన యాంటీ-హైడ్రోప్లానింగ్ టెక్నాలజీతో వస్తాయి. ఇది తడి రోడ్లపై కూడా మెరుగైన భద్రతను అందిస్తుంది. ఈ టైర్లు సుదూర ప్రయాణానికి, అధిక నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి.

కాంటినెంటల్ కాంటిస్పోర్ట్ కాంటాక్ట్ 5 (Continental ContiSportContact 5) వేగం, భద్రత పరంగా ఉత్తమ టైర్. ఈ టైర్లు అధిక నాణ్యత, అధిక-వేగ స్థిరత్వాన్ని అందిస్తాయి. వాటి పట్టు, బ్రేకింగ్ అధిక వేగంతో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి.