
విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ట్యాబ్ లలో లెనోవా ట్యాబ్ ఎం11 ఒకటి. ఇది బాక్స్ లో లెనోవా పెన్ తో వస్తుంది. దీనిలో నోట్స్, డూడుల్, పీడీఎఫ్ లకు చక్కగా చూసుకోవచ్చు. 11 అంగుళాల డిస్ ప్లే, మీడియా టెక్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, దుమ్ము నుంచి రక్షణకు ఐపీ 52 అసిస్టెంట్, డాల్బీ అట్మాస్ తో కూడిన క్వాడ్ స్పీకర్లు బాగున్నాయి. జూమ్ కాల్స్, యూట్యూబ్ వీడియోలను చక్కగా చూసుకోవచ్చు. అమెజాన్ లో రూ.15,998కు ఈ ట్యాబ్ ను అందుబాటులో ఉంచారు.

లెనోవా ఎం9 ట్యాబ్ మంచి పనితీరుతో ఆకట్టుకుంటోంది. దీనిలో 9 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్పీకర్లతో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ తో వేగవంతమై పనితీరు, ఫైల్స్ దాచుకోవడానికి స్థలం అందుబాటులో ఉంది. 5,100 ఎంఏహెచ్ బ్యాటరీతో 13 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయం, మీడియా టెక్ హీలియో జీ80 అక్టా కోర్ ప్రాసెసర్, స్లైలిష్ డిజైన్, బహుళ పోర్టుల ఎంపికతో పాటు గేమింగ్ కూ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ట్యాబ్ ను అమెజాన్ లో కేవలం రూ.9,299కి అందుబాటులో ఉంచారు.

తక్కువ ధరకు నాణ్యమైన ట్యాబ్ కొనుగోలు చేయాలనేకునే వారికి వన్ ప్లస్ ట్యాబ్ గో చాలా బాగుంటుంది. 11.35 అంగుళాల డిస్ ప్లేలో విజువల్స్ స్పష్టంగా చూడవచ్చు. డిజైనింగ్ చేసుకోవడానికి, నోట్ టేకింగ్ కు అనువుగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమైన పత్రాలు చదువుకోవచ్చు. డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్లు చక్కని ఆడియో అందిస్తాయి. డీసీ డిమ్మింగ్, బ్లూలైట్ ఫీచర్లతో కంటిపై ఒత్తిడి ఉండదు. 8 జీబీ ర్యామ్, మీడియా టెక్ హెలియా జీ 99 ప్రాసెసర్ అమర్చారు. అమెజాన్ లో ఈ ట్యాబ్ ను రూ.17,999కి కొనుగోలు చేయవచ్చు.

అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ, మంచి పనితీరు కలిగిన ట్యాబ్ కొనాలనుకుంటే రెడ్ మీ ప్యాడ్ ప్రో 5జీని ఎంపిక చేసుకోవచ్చు. దీనిలో 12.1 అంగుళాల డిస్ ప్లేలో విజువల్స్, వీడియోలు చాలా స్పష్టంగా చూడవచ్చు. వివిధ యాప్ లను ఒకేసారి యాక్సెస్ చేయడానికి, పనిచేయడానికి వీలుంటుంది. మల్టీ టాక్సింగ్ కు ఉపయోగపడే స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, కంటిని రక్షణ ఇచ్చే ట్రిపుల్ ఐ కేర్ టెక్, స్టాండ్ బైలో 33 రోజులుంటే బ్యాటరీ జీవితం కాలం, 16 గంటల వీడియో ప్లేబ్యాక్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ చాలా ఉపయోగంగా ఉన్నాయి. ఈ ట్యాబ్ అమెజాన్ లో రూ.24,490కి అందుబాటులో ఉంది.

ప్రముఖ బ్రాండ్ సామ్సంగ్ నుంచి విడుదలైన గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ అనేక ప్రత్యేకతలతో ముందుకు వచ్చింది. 11 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లేతో విజువల్స్ స్పష్టంగా చూడవచ్చు. డాక్యుమెంట్లు చూసుకోవడానికి, రీడింగ్ కు చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యమైన పత్రాలను నిల్వ చేసుకోవడానికి 128 జీబీ స్టోరేజీ ఉంది. క్వాడ్ స్పీకర్లతో స్పష్టమైన ఆడియో వినవచ్చు. పనిచేసుకోవడానికి, విరామ సమయంలో వినోదం కోసం కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అమెజాన్ లో రూ.18,190కి ఈ ట్యాబ్ అందుబాటులో ఉంది.