రియల్ మీ 10 ప్రో 5జీ.. ఈ ఫోన్ అమెజాన్ సైట్లో రూ. 19,060గా ఉంది. హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే రూ. 250 వరకూ తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ నుఎక్స్ చేంజ్ చస్తే రూ. 17,800 వరకూ తగ్గవచ్చు. దీని స్పెసిఫికేషన్లు పరిశీలిస్తే.. 6.72-అంగుళాల ఎల్సీడీ ఫుల్ హెచ్ డీ ప్లస్ స్క్రీన్‌తో వస్తుంది. అడ్రోనో 619 జీపీయూ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. వెనుకవైపు 108ఎంపీ, ముందు వైపు 16ఎంపీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.