
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్‌డే సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా అన్ని రకాల గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

Redmi 9i: రెడ్‌డీ 9ఐ స్మార్ట్ ఫోన్ ఆఫర్‌లో భాగంగా రూ. 8,499కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ, 5000ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసరెర్‌ను అందించారు. 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Micromax In note 1: ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ. 9,499కి అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

Infinix Hot 11S: ఈ స్మార్ట్ ఫోన్ రూ. 9,999కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 9,249కే లభిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. అంతేకాకుండా 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Samsung Galaxy F12: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్స్‌లో సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్12 ఒకటి. ఈ ఫోన్ రూ. 9,699కి అందుబాటులో ఉంది. ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.