Amazon: ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈ ఫోన్స్‌పై 75 శాతం డిస్కౌంట్‌..

|

Sep 09, 2024 | 10:05 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్ అందిస్తోన్న విషయం తెలిసిందే. అమెజాన్‌ ఎలక్ట్రానిక్స్‌ సేల్ పేరుతో నిర్వహిస్తున్న సేల్‌లో భాగంగా పలు ఫోన్‌లపై భారీ తగ్గింపు ధరను ప్రకటించాయి. సెప్టెంబర్‌ 6వ తేదీన మొదలైన ఈ సేల్‌ 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా బెస్ట్ డీల్స్‌ లభిస్తున్న రెండు స్మార్ట్ ఫోన్‌ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తున్న బెస్ట్‌ ఫోన్స్‌లో రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ ఫోన్‌ ఒకటి. ఈ ఫోన్‌ను కంపెనీ ఈ ఏడాది మార్చి నెలలో లాంచ్‌ చేసింది. సేల్‌లో భాంగగా ఈ ఫోన్‌ రూ. 18,999కి లభిస్తోంది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

2 / 5
రియల్‌మీ నార్జో 70 ప్రో ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌, 2 ఎంపీతో కూడిన మాక్రో లెన్స్‌ను అందించారు. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

3 / 5
ఈ సేల్‌లో భాగంగా లభిస్తోన్న మరో బెస్ట్ డీల్‌ వన్‌ప్లస్ 11ఆర్‌ ఒకటి. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 39,999కాగా ప్రస్తుతం అమెజాన్‌ సేల్‌లో భాగంగా రూ. 28,999కి సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 11 వేల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

4 / 5
ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెండి క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌ ఓఐఎస్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 1000 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు.