ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. ప్రజలు కూడా వీటి వినయోగంపై ఆసక్తి చూపిస్తుండడంతో రోజుకో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి.
ఇందులో భాగంగానే తాజాగా మార్కెట్లోకి సింపుల్ ఎనర్జీ అనే స్టార్టప్ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్‌ను స్కూటర్ ధరను రూ. 1.10 లక్షలుగా నిర్ణయించింది. ఈ స్కూటర్‌ను రూ. 1947 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
ఆరు కిలోల బరువుతోన్న ఉన్న ఈ స్కూటర్‌లో 4.8 కిలోవాట్స్ గల పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని ఇచ్చారు. డిటాచబుల్, పోర్టబుల్ ఫీచర్‌తో సులభంగా బ్యాటరీ చార్జ్ చేసుకోవచ్చు.
కేవలం నిమిషం చార్జింగ్ చేస్తే 2.5 కిలోమీటర్లు దూసుకెళుతుంది. ఇక ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఏకంగా 203 కిలో మీటర్లు వెళ్లొచ్చు.
గంటకు 105 కి.మీల వేగంతో దూసుకుపోగలిగే ఈ స్కూటర్‌లో 7 అంగుళాల కస్టమైజబుల్ డిజిటల్ డ్యాష్ బోర్డ్, ఆన్ బోర్డ్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, ఎస్ఓఎస్ మెసేజ్, డాక్యుమెంట్ స్టోరేజీ, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు అందించారు.