
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం అసస్ మార్కెట్లోకి మూడు కొత్త ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేసింది. ExpertBook P5, ExpertBook B3, ExpertBook B5 పేర్లతో మొత్తం మూడు ల్యాప్‌టాప్స్‌ను తీసుకొచ్చింది.

ఈ మూడు ల్యాప్‌టాప్స్ అన్నీ ఇంటెల్ కొత్త కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Asus ExpertBook P5 Copilot+తో వస్తోన్న తొలి ల్యాప్‌టాప్ ఇదే కావడం విశేషం. ఈ ల్యాప్‌టాప్‌లో ట్రిపుల్ ఏఐ ఇంజన్‌ను అందించారు. 47 NPU టాప్‌ల వరకు మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

వీటిలో 32GB LPDDR5X ర్యామ్, రెండు Gen 4 NVMe SSD స్లాట్‌లను అందించారు. ఈ ల్యాప్‌టాప్‌లో 2.5కే రిజల్యూషన్‌తో కూడిన ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.

ఈ ల్యాప్‌టాప్‌లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. ఇ వైఫ్ 6ఈతో పాటు 4జీ ఎల్‌టీఈ ఫీచర్లను అందించారు. ఆప్షనల్ టచ్ డిస్‌ప్లేను అందించారు.

ధర విషయానికొస్తే అసస్ ExpertBook P5 ధర రూ. లక్ష నుంచి ప్రారంభం కానుంది. మిగతా ల్యాప్‌టాప్స్ ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.