Google Search Engine: తస్మాత్ జాగ్రత్త.. గూగుల్‌ సెర్చింజన్‌లో వీటిని వెతుకుతున్నారా? అయితే ఇవి తెలిసుకోవాల్సిందే..

|

May 05, 2021 | 2:43 PM

Google Search Engine: తస్మాత్ జాగ్రత్త.. గూగుల్‌ సెర్చింజన్‌లో వీటిని వెతుకుతున్నారా? అయితే ఇవి తెలిసుకోవాల్సిందే..

1 / 8
ఏం తెలుసుకోవాలన్నా.. ఏ అవసరం అయినా ప్రతీ ఒక్కరూ టక్కున ఓపెన్ చేసిది గూగుల్. ఎవరికి ఎలాంటి సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ సెర్చ్ కొట్టేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే, అన్ని విషయాలపై ఇలా గూగుల్ సెర్చ్ చేయడం ప్రమాదకరం అని మీకు తెలుసా?. అవును.. గూగుల్‌లో అన్నింటినీ ఏది పడితే అది సెర్చ్ చేస్తే మీరు అడ్డంగా బుక్కైపోతారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 8
ప్రపంచంతో పాటే.. టెక్నాలజీ కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆ టెక్నాలజీనే యూజర్ల కొంప ముంచుతోంది. మనిషి అవసరాలను ఆసరగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు.

3 / 8
గూగుల్‌లో ప్రభుత్వ వెబ్‌సైట్లు వెతికే వాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే హ్యాకర్ల బారిన పడి చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం, ఇతర వెబ్‌సైట్ల యూఆర్ఎల్‌ను కచ్చితంగా తెలుసుకున్న తరువాత ఓపెన్ చేయడం ఉత్తమం.

4 / 8
గూగుల్‌లో సెర్చ్ చేసే కస్టమర్ కేర్‌ నెంబర్లను గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. సాధ్యమైనంత వరకు సంబంధిత సంస్థ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి కస్టమర్ కేర్ నెంబర్ తీసుకుని సంప్రదించడం చాలా సేఫ్.

5 / 8
కొంత మంది తమ వ్యక్తిగత వివరాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరం. పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, మెయిల్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలను గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా మీ వివరాలను సైబర్ నేరగాళ్లు తెలుసుకునే అవకాశం ఉంది. అందుకే అడ్డగోలుగా వ్యక్తిగత వివరాలను గూగుల్ సెర్చ్ చేయడం అంత మంచిది కాదు.

6 / 8
సోషల్ మీడియా, వాట్సప్‌లో వచ్చే లింక్‌ను గుడ్డిగా క్లిక్ చేయొద్దు. అలా చేయడం ద్వారా సునాయాసంగా హ్యాకర్ల చేతిలో చిక్కే అవకాశం ఉంది. అందుకే సోషల్ మీడియాలో, వాట్సప్, మొబైల్ ఫోన్లకు వచ్చే లింక్‌లను ఓపెన్ చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించండి.

7 / 8
యాప్‌ల కోసం, సాఫ్ట్ వేర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసేందు కశ్చితమైన సమాచారాన్ని తెలుసుకున్న తరువాతే వెతికితే చాలా మంచిది. గూగుల్‌లో ఒరిజినల్ యాప్స్, సాఫ్ట్‌వేర్లతో పాటు.. నకిలీ యాప్స్ కూడా ఉంటాయి. వాటి ద్వారా యూజర్లు నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌ల కోసం వెతికే ముందు జాగ్రత్త వ్యవహరించడం ఉత్తమం.

8 / 8
పోర్నోగ్రఫీ, ఆయుధాల తయారీ వంటి వాటి గురించి గూగుల్‌లో అస్సలు సెర్చ్ చేయకండి. ప్రస్తుతం ప్రభుత్వాలు ఈ అంశాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వీటి గురించి సెర్చ్ చేసిన వారి ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి మరీ నిఘా పెడుతున్నాయి. కాబట్టి ఈ వ్యవహారాల్లో తస్మాత్ జాగ్రత్త.