
టెక్నాలజీ పెరింగి. అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం అవుతున్నాయి. గతంలో మొబైల్ ఫోన్ పోయిందంటే.. వదిలేసుకోవడం లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుండేది. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో అంత రిస్క్ లేకుండా సునాయాసంగా పోయిన ఫోన్‌ను కనిపెట్టవచ్చు. ఇందుకోసం అనేక యాప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఫైండ్ మై యాప్: ఈ యాప్ ద్వరా పోయిన ఫోన్ ఎక్కడున్నా గుర్తించవచ్చు. యాప్‌లో లొకేషన్ ఆధారంగా ఫోన్ ఉన్న ప్లేస్‌ను తెలుసుకోవచ్చు. ఒకవేళ ఫోన్ దొరకనట్లయితే.. అందులోని డేటా అంతటినీ పూర్తిగా తొలగించవచ్చు. ఫోన్‌ను కూడా బ్లాక్ చేయొచ్చు.

మిస్ అయిన ఫోన్‌లను ‘ప్రే’ యాప్ ద్వారా కనిపెట్టొచ్చు. ఈ యాప్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసిన డివైజ్‌లను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుంది. తద్వారా మీ ఫోన్ పోయినా కనిపెట్టొచ్చు.

మెకాఫీ మొబైల్ సెక్యూరిటీ యాప్‌లో డివైస్ లాక్ సెక్యూరిటీ, యాంటీ థెఫ్ట్ ఫీచర్లు ఉంటాయి. ఈ యాప్‌లోని ఫైండ్ మై ఫోన్ ఫీచర్‌తో మీ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అన్నింటికీ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ యాప్ మీ ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తుల ఫోటోలను కూడా క్యాప్చర్ చేస్తుంది.

యాంటీ థెఫ్ట్ అలారం యాప్ మీ ఫోన్ దొంగతనానికి గురికాకుండా కాపాడుతుంది. ఎవరైనా మీ ఫోన్‌ను కాజేయాలని ప్రయత్నిస్తే అది వెంటనే అలర్ట్ చేస్తుంది. ఆ మేరకు అలారం మోగుతుంది.

సెర్బరస్ యాప్ మీ ఫోన్‌ను పలు రకాలుగా సేవ్ చేస్తుంది. ఫోన్ పోయినట్లయితే, యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపిస్తుంటుంంది. సిమ్ మార్చినా.. ఆ సిమ్ వివరాలను కూడా పంపిస్తుంటుంది. అంతేకాదు.. ఆ సిమ్ లొకేషన్‌ను చేరవేస్తుంది.