యాపిల్ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ విడుదలైంది. 2024 యాపిల్ వాచ్ పేరుతో ఈ కొత్త వాచ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అత్యాధునిక ఫీచర్లతో ఈ వాచ్‌ను లాంచ్ చేశారు.
2024 యాపిల్ వాచ్‌లో బీపీ మానిటరింగ్ వంటి అధునాతన ఫీచర్ ఈ వాచ్ సొంతం. అయితే ఇప్పటికే బీపీ మానిటరింగ్ వంటి ఫీచర్లు వాచ్‌లలో ఉన్నా.. కచ్చితత్వంలో కూడిన వివరాలను అందించలేవు. అయితే యాపిల్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన ఫీచర్స్‌ను తీసుకొస్తున్నారు.
ఈ వాచ్‌లోని బీపీ మానిటరింగ్ ఫీచర్‌తో ఇవి మెరుగైన బీపీ మానిటరింగ్ వ్యవస్థను అందించనున్నారు. హైపర్ టెన్షన్ శోధనలో బీపీ సెన్సర్ టెక్‌ను ఈ ఫీచర్‌లో జోడించనున్నారు. ఈ వివరాలను బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.
బీపీ రీడింగ్స్‌ను కచ్చితత్వంతో తెలపడం వల్ల యూజర్లను యాపిల్ డివైజ్ వెంటనే అలర్ట్ చేసే విధంగా టెక్నాలజీని తీసుకొచ్చారని కంపెనీ చెబుతోంది. స్లీప్ అపెనా డిటెక్షన్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీంతో నిద్రలేమి వంటి సమస్యలను కూడా పసిగట్టవచ్చు.
2024 స్మార్ట్ వాచ్‌లోని స్లీప్ అప్నియా డిటెన్షన్ ఫీచర్‌తో నిద్రలేమి సమస్యను వెంటనే గుర్తించి, వైద్యుల సలహాలు తీసుకోవాలని యూజర్లను అప్రమత్తం చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ యాపిల్ వాచ్ ధర, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.