
Apple iPhone 15 Series లుక్: ఐఫోన్ 15 సిరీస్‌లో నాచ్‌కు బదులుగా డైనమిక్ ఫీచర్ ఉంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మోడల్స్ పరిమాణం 6.1 అంగుళాలు.. ఐఫోన్ ప్లస్, ఐఫోన్ ప్రో ప్లస్ మోడల్స్ పరిమాణం 6.7 అంగుళాలుగా ఉంది. ఆకర్షణీయమైన ఫ్రంట్ డిజైన్ కలిగిన ఈ ఆపిల్ నాలుగు మోడల్స్‌కి రిఫ్రెష్ రేట్ 60 Hz. ప్రో మోడల్ ఐఫోన్‌లో టైటానియం ఫ్రేమ్, మల్టీ టాస్కింగ్ కోసం యాక్షన్ బటన్ ఉన్నాయి.

Apple iPhone 15 Series కెమెరా: ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్ వెనుక భాగంలో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12MP సెకండరీ కెమెరాతో రెండు కెమెరాల సెటప్ ఉంది. అలాగే ఆపిల్ ఐఫోన్ 15 ఫ్రో, ఆపిల్ ఐఫోన్ 15 ఫ్రో మ్యాక్స్ మోడల్‌లో 48MP ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ మాక్రో కెమెరా సెటప్ ఉంది. ప్రో మోడల్‌లో 3X టెలిఫోటో లెన్స్, ప్రో ప్లస్ మోడల్‌లో 5X ఆప్టికల్ జూమింగ్ ఫీచర్ కూడా ఉన్నాయి.

Apple iPhone 15 Series చిప్‌సెట్: ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్‌లో A16 బయోనిక్ చిప్‌సెట్ ఉంది. దీంతో పాటు వైర్, వైర్లెస్ కనెక్టివిటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఐఫోన్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో ప్లస్ మోడల్‌ల్లో A17 బయోనిక్ ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 15 సిరీస్‌లో ప్రో మోడల్స్ 20 శాతం వేగవంతమైన GPU పనితీరుతో వస్తున్నాయి. వీటి సహాయంతో మీరు మెరుగైన గేమింగ్ అనుభూతిని పొందుతారు.

Apple iPhone 15 Series బ్యాటరీ: గత మోడల్స్ కంటే ఈ సారి విడుదలైన ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్‌లో బ్యాటరీ పవర్ మెరుగ్గా ఉంది. చార్జ్ చేసేందుకు USB టైప్ C ఛార్జర్ ఉంది. కొత్త ఐఫోన్ సిరీస్‌లోని ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 3,877 mAh, ఐఫోన్ 15 ప్లస్ 4,912 mAh, ఐఫోన్ 15 ప్రో 3,650 mAh, ఐఫోన్ 15 ప్రో ప్లస్ 4,852 mAh బ్మాటరీ బ్యాకప్‌ని కలిగి ఉన్నాయి.

Apple iPhone 15 Series ధర: 128 GB, 256 GB, 512 GB స్టోరేజ్ ఆప్షన్‌లతో ఈ మోడల్స్ వస్తున్నాయి. ఇక ఈ ఐఫోన్ మోడల్స్ ప్రిబుకింగ్ సెప్టెంబర్ 15.. సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ నుంచి ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం Apple iPhone 15 ధర 128 GB స్టోరేజ్ మోడల్‌కు $799, భారతదేశంలో ధర రూ. 79,900.. Apple iPhone 15 Plus ధర 128 GB స్టోరేజ్ మోడల్‌కు $899, భారతదేశంలో ధర రూ. 89,900.. Apple iPhone 15 Pro ధర 128 GB స్టోరేజ్ మోడల్‌కు $999, భారతదేశంలో ధర రూ. 1,34,900.. Apple iPhone 15 Pro Max ధర 256 GB స్టోరేజ్ మోడల్‌కు $1199, భారతదేశంలో ధర రూ. 1,59,900 గా ఉండనుంది.