Iphone: దొంగలకు పాస్‌వర్డ్‌ తెలిసినా ఏం చేయలేరు.. ఐఫోన్‌లో అదిరిపోయే ఫీచర్‌

Updated on: Jan 27, 2024 | 10:12 PM

ప్రైవసీకి పెట్టింది పేరు యాపిల్‌. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ బ్రాండ్‌ను ఎక్కువ మంది ఉపయోగించడానికి ప్రైవసీ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలు మొదలు పొలిటిషియన్స్‌ ఈ బ్రాండ్‌ను ప్రైవసీ కోసమే ఉపయోగిస్తారు. ఇలా యూజర్లు భద్రతకు పెద్ద పీట వేసే యాపిల్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది..

1 / 5
యాపిల్‌ తన స్మార్ట్‌ ఫోన్‌ యూజర్ల భద్రత కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రైవసీకి పెద్ద పీట వేసే యాపిల్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

2 / 5
సాధారణంగా ఎవరైన దొంగలు ఫోన్‌ను కొట్టేస్తే అందులోని సమాచారం అంతా తెలిసిపోతుందనే భయం ఉంటుంది. అందుకే పాస్‌వర్డ్‌, స్క్రీన్‌ ప్యాట్రన్‌లను పెట్టుకుంటుంటారు. అయితే ఒకవేళ పాస్‌వర్డ్‌ తెలిసిపోయినా ఫోన్‌ను ఏం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి.

3 / 5
అచ్చంగా ఇలాంటి ఆలోచనలో నుంచే యాపిల్‌ కొత్త ప్రైవసీ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇందులో భాగంగానే 'స్టోలెన్ డివైజ్‌ ప్రొటెక్షన్‌' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్‌తో పాటు ఐప్యాడ్‌ల్లోనూ ఈ ఫీచర్‌ అందుబాటులోకి చ్చింది.

4 / 5
 యాపిల్‌ తెచ్చిన ఈ ఫీచర్‌ సహాయంతో పాస్‌వర్డ్‌ తెలిసి ఫోన్‌ను దొంగలించినా ఆపరేట్ చేయలరు. ఈ ఫీచర్‌ను ఆన్‌చేస్తే.. మీరు రెగ్యులర్‌ వెళ్లే ప్రదేశాలకు కాకుండా ఇతర ప్రదేశాల్లో ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తే వెంటనే స్టోలెన్‌ డివైజ్‌ ప్రొటెక్షన్‌ యాక్టివేట్ అవుతుంది.

5 / 5
దీంతో సదరు ఫోన్‌ లేదా ఐప్యాడ్‌కు అదనం సెక్యూరిటీ యాడ్‌ అవుతుంది. ఆ తర్వాత డివైజ్‌ను యాక్సెస్ చేయాలంటే కచ్చితమైన ఫేస్‌ ఐడీని అందించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ను యాపిల్‌ తన కొత్త ఐఓఎస్ వెర్షన్ 17.4లో అందుబాటులోకి తీసుకొచ్చింది.