- Telugu News Photo Gallery Technology photos Amazon introduces new service called amazon clinic, check here for full details
Amazon Clinic: కొత్త సేవలను ప్రారంభించిన అమెజాన్.. ఇకపై వైద్య సేవలు కూడా
మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ డెలివరీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు పరిమితమైన అమెజాన్ తాజాగా వైద్య సేవల్లోకి ఎట్రీ ఇచ్చింది. అమెజాన్ క్లీనిక్ పేరుతో కొత్త సేవలను తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటీ క్లినిక్ సర్వీస్. ఇది ఎలా ఉపయోగపడుతుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 12, 2024 | 1:49 PM

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ప్రైమ్ పేరుతో వినోదరంగం, డెలివరీలో ఈ కామర్స్‌లో ఉన్న అమెజాన్ ఇప్పుడు వైద్య రంగంలోకి కూడా అడుగుపెట్టింది.

అమెజాన్ క్లినిక్ సర్వీస్ పేరుతో ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే ఈ సేవలను పరిచయం చేయడం విశేషం. కేవలం రూ. 299 ప్రారంభ ఛార్జీతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ అమెజాన్ క్లినిక్ ద్వారా 50కి పైగా వ్యాధులకు సంబంధించి వైద్య సమస్యలకు డాక్టర్ కన్సల్టేషన్లను పొందొచ్చు. స్పెషలైజేషన్ ఆధారంగా ఫీజు రూ. 299 నుంచి రూ. 799 వరకు ఉంటుంది. అమెజాన్ క్లినిక్ సర్వీస్ లో జనరల్ పిజీషియన్, డెర్మటాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, న్యూట్రిషన్, కౌన్సెలింగ్ వంటి వైద్య సేవలున్నాయి.

అమెజాన్ యాప్ ద్వారా వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాక్టో వంటి సేవల మాదిరిగా ఇది పనిచేస్తుంది. ఆన్‌లైన్ లో వీడియో, ఆడియో, చాట్ ద్వారా వైద్యులతో మాట్టాడుకోవచ్చు.

అయితే డాక్టర్ అపాయింట్మెంట్ కావాలనుకునే వారు పేరు, వయసు, జెండర్ మొబైల్ నెంబర్‌తో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. డెస్క్‌టాప్‌లో ఈ సేవలు పొందలేరు.




