
అమేజ్ ఫిట్ బిప్ 5 పేరుతో కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం యూకేలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 7400గా ఉండొచ్చని అంచనా.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.91 ఇంచెస్ టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్, టెంపర్డ్ గ్లాస్ వంటి ఆప్షన్స్‌ను ఇచ్చారు.

అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను అందించారు. దీంతో నేరుగా స్మార్ట్ వాచ్‌తో ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే 300 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు పనిచేస్తుంది.

ఇక అమేజ్ ఫిట్ బిప్ 5లో ప్రత్యేకంగా రియల్ టైమ్ GPS ట్రాకింగ్ ఫీచర్‌ను అందించారు. అలాగే రూట్ నావిగేషన్ కోసం నాలుగు శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ ఇస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్‌లో ఎస్‌పీఓ2, హార్ట్ రేట్ ట్రాకర్, స్ట్రెస్ లెవల్స్ మానిటర్ వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. అలాగే సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ స్విమ్మింగ్, ఇండోర్ స్పోర్ట్స్‌తో సహా 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది.