
ఐక్యూ జెడ్9 ఫోన్ భారతదేశంలో రూ.20,000 కంటే తక్కువ ధరతో అత్యుత్తమ పనితీరు గల స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్, శక్తివంతమైన ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, ఆకట్టుకునే బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ముఖ్యంగా ఈ ఫోన్‌లో ఎనిమిది 5జీ బ్యాండ్‌లు అందిస్తుండడంతో వివిధ నెట్‌వర్క్ పరిసరాలలో విశ్వసనీయ పనితీరును నిర్ధారిస్తుంది. ఛాలెంజింగ్ పరిస్థితుల్లో కూడా నెట్‌వర్క్ ప్రొవైడర్ తగిన సిగ్నల్ బలాన్ని అందజేస్తుంది. ఐక్యూ జెడ్9 ఫోన్ ప్రస్తుతం రూ.18,499కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్రష్డ్ గ్రీన్, గ్రాఫేన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

వివో టీ3 5జీ ఫోన్ ఏప్రిల్ 2024లో ప్రారంభించారు. ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 7200 చిప్‌సెట్, 120 హెచ్‌జెడ్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, గణనీయమైన 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. రూ.17,287 ధరతో అమెజాన్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ క్రిస్టల్-క్లియర్ ఆడియోతో అత్యుత్తమ కాలింగ్ సామర్థ్యాలను అందిస్తుంది.

ఐక్యూ జెడ్9 సిరీస్‌లో భాగంగా రిలీజ్ చేసిన ఐక్యూ జెడ్9 ఎస్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ యువతను ఆకట్టుకుంటున్నాయి. ఎమెఎల్ఈడీ డిస్ప్లే, డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, బలమైన 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వినియోగదారులకు సిగ్నల్ సమస్య వల్ల ఎలాంటి కాల్ డ్రాప్‌లు ఈ ఫోన్‌లో ఉండవని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతన్నారు. ప్రస్తుతం ఐక్యూ జెడ్9 ఎస్ ఫోన్ ప్రస్తుతం రూ. 19,998కు అందుబాటులో ఉంది. అలాగే ఆంక్సీ గ్రీన్, టైటానియం మట్టే రంగుల్లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

మే 2024లో రిలీజ్ చేసిన మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్, మృదువైన ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, అసాధారణమైన కెమెరా కాన్ఫిగరేషన్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్ధ్యం వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ పదమూడు 5జీ బ్యాండ్‌లకు మద్దతు ఇవ్వడంతో సిగ్నల్ సమస్య ఉండదు. డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో వచ్చే ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.19999కు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మార్ష్‌మల్లౌ బ్లూ, ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్, ఫారెస్ట్ గ్రీన్ వంటి రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 16 భారతదేశంలో త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఫోన్ రూ.20 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ గురించి సామ్‌సంగా ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ కొన్ని లీక్స్ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. గెలాక్సీ ఎఫ్ 16 మోడల్ గెలాక్సీ ఏ16కు సంబంధించిన రీబ్రాండెడ్ వెర్షన్‌గా భావిస్తున్నారు.