
టీ తాగే సమయంలో లేదా ఇతరులకు టీ ఇచ్చే సమయంలో సాధారణంగా టీ ఒలికిపోతుంది. ముఖ్యంగా సోఫాలపై, బెడ్ లేదా డ్రెస్‌లపై టీ పడుతుంది. ఇక వీటి మరకలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ సోఫాలపై ఎక్కువగా కనిపిస్తాయి. అయితే చాలా మంది టీ పడిన వెంటనే వాటిని తొలిగించడానికి , పౌడర్ వేయడం లేదా రుద్ధడం చేస్తుంటారు. కానీ అలా కాకుండా కొన్ని చిట్కాలు పాటించడం వలన టీ మరకలు సులభంగా తొలిగిపోతాయంట. అవి ఏవో చూసేద్దాం.

చాలా మంది టీ ఒలికిన వెంటనే శుభ్రం చేయడం ప్రారంభిస్తారు. కానీ అలా చేయకూడదు. అంతే కాకుండా కొందరు టీ పడిన తర్వాత చాలా సేపటికి దానిని శుభ్రం చేస్తుంటారు కానీ అలా కూడా చేయకూడదంట. టీ పడిన చోటను క్లీన్ చేయడం కోసం ఒక పొడి క్లాత్ తీసుకోవాలి. మరక పడిన చోట దానిని మెల్లగా నొక్కాలి. దీని వలన టీ మొత్తం పీల్చుకుంటుంది. ఇలా చేయడం వలన మరక ఎక్కువగా వ్యాప్తిచెందకుండా ఉంటుంది.

టీ ఒలికిపోయిన తర్వాత దానిని క్లీన్ చేయడం కోసం పౌడర్ లాంటివి వేయాల్సిన పని లేదు. దీని కోసం చల్లటి నీరు అలాగే డిటర్జెంట్ లిక్విడ్ తీసుకోవాలి. ఎక్కడ అయితే టీ మరకలు ఉంటాయో, అక్కడ అద్దాలి. దీని వలన టీ మరకలు త్వరగా పోతాయి. దీని కోసం రెండు కప్పుల చల్లటి నీటిలో డిటర్జెంట్ కలపాలి. వస్త్రాన్ని అందులో తడిపి మరక ఉన్న ప్రదేశంలో అద్దాలి. దీని వలన మరక త్వరగా తొలిగిపోతుంది.

ఇలా చేసిన తర్వాత మరోసారి మంచి వాటర్‌లో వేరొక క్లాత్ తీసుకోవాలి. దానిని అందులో మంచి, మరక ఉన్న చోట అద్దుతూ దానిని తుడిచి వేయాలి. ఇలా చేయడం వలన టీ లేదా కాఫీ మరకలు త్వరగా తొలిగిపోతాయి. ఆ తర్వాత పొడి క్లాత్ తీసుకొని దానిని మొత్తం తుడిచి వేస్తూ క్లీన్ చేయాలి. అంతే మరక పూర్తిగా తొలిగిపోతుంది. సోఫా కూడా ఎప్పటిలా నీటుగా, శుభ్రంగా ఉంటుంది.

అలాగే ఎప్పుడైనా సరే టీ మరకలను శుభ్రం చేసే సమయంలో వాటిని బలంగా రుద్దకూడదు. అంతే కాకుండా పడిన వెంటనే వాటర్ పోయకూడదు. బలంగా రుద్దడం వలన టీ వ్యాప్తి పెరుగుతుంది. లోపలి దారాలు కూడా దెబ్బతింటాయి. దీని వలన టీ మరకలు పోవడం కాదు, క్లాత్ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది. అందువలన చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.