
ఈ రోజు కోసం దేశం మొత్తం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసింది. ఎందుకంటే, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే, ఫలితాలు వచ్చిన తరవాత జనాలు మార్పు కావాలని కోరుకున్నారు.

తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఏపీలో సంబరాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో TVK అధిక్యం పై నగరిలో విజయ్ అభిమానులు వేడుకలు జరుపు కున్నారు. క్లాక్ టవర్ వద్ద బాణాసంచా కాల్చిన అభిమానులు కేరింతలు కొట్టారు. సత్యవేడు నియోజకవర్గం లోని నాగలాపురం లోనూ విజయ్ అభిమానులు టీవీకే గెలుపుతో సంబరాలు జరుపుకున్నారు

మరోవైపు తమిళనాడు లో TVK అధిక్యంతో చంద్రగిరిలోనూ వైసీపీ సంబరాలు జరుపుకుంది.చంద్రగిరిలో వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. జగన్, విజయ్ ఫోటోలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు.

టవర్ క్లాక్ కూడలి వద్ద కేక్ కటింగ్ చేసి టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు వైసీపీ నేతలు. జగన్ తరహా లో విజయ్ సింగిల్ గా పోటీ చేసి గెలవడం ఎంతో సంతోషంగా ఉందని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అన్నారు.

తన కొడుకు విజయ్ గెలుపు పై తండ్రి చంద్రశేఖర్ హర్షం సీఎంకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ విజయ్ తండ్రి ట్వీట్ చేశారు. గెలుపుపై విజయ్‌కి అనుమానం లేదు అందుకే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోలేదని విజయ్ తండ్రి చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.