
జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్‌లోని ఒక అధ్యయనం ప్రకారం కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్‌లపై ఎక్కువ సమయం గడపడం మీ కళ్ళకు ప్రాణాంతకం. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన పోషకాహారం అవసరం. ఈ క్రమంలో కంటిచూపు సంరక్షణ కోస మీరు పండ్లు, కూరగాయల రసాలను త్రాగవచ్చు.

కొబ్బరి నీటిలో విటమిన్ సి, ఇతర ముఖ్యమైన ఖనిజాలతో పాటు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కళ్ళ సంరక్షిత కణజాలాలను మెరుగుపరచడంలోఎంతగానో సహాయపడుతుంది.

ఆరెంజ్ జ్యూస్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి ప్రధాన వనరులలో ఆరెంజ్ ఒకటి. ఈ జ్యూస్ తాగడం వల్ల కంటిశుక్లం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాంటీఆక్సిడెంట్స్‌కు మంచి మూలం. ఇవి మన కళ్ళకు చాలా మేలు చేస్తాయి. ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ ఉన్నాయి. ఇవి కంటిపై పడే హానికరమైన కాంతి కిరణాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

కళ్లకు కావాల్సిన పోషకాలు చాలా వరకు టమోటా రసంలో ఉంటాయి. టమాటాలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం వంటి పలు పోషకాలు మన కంటి చూపును పెంచడంలో ఇంకా కాపాడడంలో సహాయపడతాయి.